స్థానిక ఎన్నికల వేళ.. వైసీపీ దాడులపై బీజేపీ సీరియస్..!

| Edited By:

Mar 11, 2020 | 4:25 PM

ఏపీలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆగ్రహావేశాలు వ్వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.

స్థానిక ఎన్నికల వేళ.. వైసీపీ దాడులపై బీజేపీ సీరియస్..!
Follow us on

ఏపీలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆగ్రహావేశాలు వ్వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదులు అందుతున్నాయి. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న ఇతర పార్టీల అభ్యర్థుల్ని వైసీపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే వార్తలు, వీడియోలు కనిపిస్తున్నాయి.

మరోవైపు.. ఎన్నిక వేళ అధికార పార్టీ కార్యకర్తల దాడులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు స్పందించారు. బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు చేస్తున్న దాడుల్ని ఆయన ఖండించారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈసీ కల్పించుకొని రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని కూడా కోరారు. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా ఈసీను డిమాండ్ చేశారు. ట్విట్టర్‌లో ఓ వీడియో లింక్ కూడా షేర్ చేశారు. అందులో బీజేపీ కార్యకర్తలు గాయాలతో ఉన్న విజువల్స్ షేర్ చేశారు.

[svt-event date=”11/03/2020,4:07PM” class=”svt-cd-green” ]