బీజేపీ ఎమ్మెల్యేపై నడ్డా సీరియస్.. చర్యలకు ఆదేశం..

| Edited By:

Apr 28, 2020 | 9:02 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలు ఎవరూ ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దని వ్యాఖ్యానించిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీపై చర్యలు తీసుకోవాలని

బీజేపీ ఎమ్మెల్యేపై నడ్డా సీరియస్.. చర్యలకు ఆదేశం..
Follow us on

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలు ఎవరూ ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దని వ్యాఖ్యానించిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ యూనిట్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. ఈ దేశంలో ఉన్న వారంతా భారతీయులేనని పేర్కొన్న ఆయన.. ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా వ్యవహరించవద్దని పార్టీ నేతలకు సూచించారు.

వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ.. ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశం మొత్తం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బీజేపీ నేతలు మాత్రం ద్వేషాన్ని పెంచుకోవడంలో బిజీగా ఉన్నారని యూపీ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తివారీ.. తాను అలా అన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

మరోవైపు.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో తబ్లిగీ జమాత్ సభ్యుల పాత్ర ఉందని చాలా మంది తనకు పిర్యాదు చేశారని, ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వారి నుంచి కూరగాయలు కొనొద్దని ముందుజాగ్రత్త చర్యగా సూచించానని పేర్కొన్నారు.