#BJP Comments కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ నేతల ప్రశంసలు

|

Mar 31, 2020 | 5:05 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్... ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంజయ్ కుమార్ ప్రశంసలు కురిపించారు.

#BJP Comments కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ నేతల ప్రశంసలు
Follow us on

BJP president Sanjay appreciates KCR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంజయ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సంజయ్ కుమార్ ముఖ్యమంత్రికి మంగళవారం లేఖ రాశారు.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల బీజేపీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు సంజయ్. కరోనా కోసం కేంద్రం లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయల ప్యాకేజీని అందుబాటులో కె తెచ్చిందని దాని పూర్తిగా వినియోగించుకుని లాక్ డౌన్ పీరియడ్‌లో ప్రజలను ఆదుకోవాలని సంజయ్ తన లేఖలో ముఖ్యమంత్రికి సూచించారు. తెలంగాణలో ఆన్ లైన్ / ఆఫ్ లైన్ విధానం ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ రికార్డులలో నమోదైన సుమారు 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కోసం 2300 కోట్ల సెస్ నిధులను ఖర్చు చేసుకొనేలా అవకాశం కల్పిస్తూ కేంద్ర కార్మిక శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఖాతాల్లోకి నగదు పంపిణీ చేయాలని సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో చర్చించకుండా 50 శాతం జీతాలను తగ్గించడం సమంజసంగా లేదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని బీజేపీ నేత సీఎంను కోరారు. కోవిడ్-19 మొదలైన మొదటి నెలలోనే కేవలం 15 రోజుల లాక్ డౌన్‌కే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంత దారుణంగా తయరైందా అని సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగస్తుల, కార్మికుల వేతనాలను తగ్గించే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్న రాష్ట్రం తెలంగాణనే అని సంజయ్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక, సహాయ చర్యల్లో పాలు పంచుకునే వివిధ శాఖల ఉద్యోగులు, ఆరోగ్యశాఖ, వైద్యులు, నర్సులు, నాలుగవ తరగతి ఉద్యోగులు, పోలీస్ ఇతర శాఖల సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు సంజయ్.