హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ నేతల రహస్య భేటీ

| Edited By:

Aug 31, 2019 | 4:06 PM

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తనదైన ఎత్తగడతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్ధానాలను కైవసం చేసుకుని టీఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటూ చెబుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది మేమే అంటోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన సీనియర్ నేతలు అనేకమంది ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఇప్పడు ఏపీలో కమలం పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో గల […]

హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ నేతల రహస్య భేటీ
Follow us on

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తనదైన ఎత్తగడతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే తెలంగాణలో అనూహ్యంగా నాలుగు ఎంపీ స్ధానాలను కైవసం చేసుకుని టీఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటూ చెబుతోంది. ఇక ఏపీ విషయానికి వస్తే సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది మేమే అంటోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన సీనియర్ నేతలు అనేకమంది ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఇప్పడు ఏపీలో కమలం పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది.

దీనిలో భాగంగా శనివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో గల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో బీజేపీ నేతల రహస్యంగా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీజేపీ నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, మాణిక్యాలరావు, టీజీ వెంకటేశ్, సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటి నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే ఏపీకి చెందిన నేతలు తెలంగాణలో సమావేశం కావాల్సిన అవసరం ఏమిటీ? అనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సీక్రెట్ మీటింగ్‌కి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరుకావడం కూడా ఆసక్తిని పెంచుతోంది.