నేడు ఆ ముగ్గురు జర్నీ… కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్… తాను ఉన్నా లేకున్నా అంటూ ఎమోషనల్ అయిన హారిక…

| Edited By:

Dec 17, 2020 | 11:59 AM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. దీంతో బిగ్‌బాస్ బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్ల‌ను ఒక్కొక్క‌రిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్ర‌యాణాన్ని చూపిస్తున్నాడు.

నేడు ఆ ముగ్గురు జర్నీ... కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్... తాను ఉన్నా లేకున్నా అంటూ ఎమోషనల్ అయిన హారిక...
Follow us on

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. దీంతో బిగ్‌బాస్ బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్ల‌ను ఒక్కొక్క‌రిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్ర‌యాణాన్ని చూపిస్తున్నాడు. కాగా, నిన్నడిసెంబర్ 16న ప్రసారమైన ఎపిసోడ్‌లో అఖిల్‌, అభిజిత్ బిగ్ బాస్ జర్నీని చూపించారు. ఆ సందర్భంగా వారి ప్రయాణాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.

 

తన డ్యాన్స్ చూసి మురిసిపోయిన హారిక..

తాజాగా విడుదలైన ప్రోమోలో హారిక 100 రోజుల జర్నీని బిగ్‌బాస్ జర్నీని చూపించినట్లు అర్థం అవుతోంది. ఈ సందర్భంగా ప్రోమోలో హారిక వెరైటీ డ్యాన్స్‌ వేసిన వీడియోను చూపించారు. దానికి హోస్ట్ నాగార్జున రియాక్షన్ కూడా చూపించారు. అయితే తన డ్యాన్స్‌ను చూసి హారిక మురిసిపోయింది. అంతే కాకుండా వీడియో మొత్తం చూసాక మాట్లాడుతూ… తాను ఉన్నా లేకున్నా బిగ్‌బాస్‌లో తన జర్నీ ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నట్లు తెలుస్తోంది.

 

జై సింగరేణి ముద్దుబిడ్డ అన్న సోహైల్

హౌస్‌మేట్స్ జర్నీ చూపించే ముందు బిగ్‌బాస్ వారికి పెద్ద బాణాసంచాల మెరుపులతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో సోహైల్ తన జర్నీని చూసుకునేందుకు వచ్చినప్పుడు వెలిగిన బాణాసంచాల మధ్య జై సింగరేణి ముద్దుబిడ్డ అంటూ తనను తాను వెల్కమ్ చేసుకున్నాడు. తన జర్నీలో అఖిల్, అరియానా, అభిజిత్, ఇలా హౌస్‌మేట్స్‌తో గొడవపడిన సందర్భాలను బిగ్‌బాస్ సోహైల్‌కు చూపించాడు. దీంతో సోహైల్ కొద్దిసేపు భావోద్వేగానికి లోనయ్యాడు. అనంతరం బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు తెలిపాడు…

 

వావ్ అని ఆశ్చర్యపోయిన అరియానా…

బిగ్‌బాస్ తన జర్నీ చూపినప్పుడు అరియానా వావ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ వీడియోలో అరియానా సోహైల్‌తో గొడవ పడిన సందర్భం, అభి తనని ఓదార్చిన సన్నివేశం, హౌస్‌లో తను టాస్క్‌ల్లో ప్రదర్శించిన ఆట తీరును ప్రదర్శించారు.