బిగ్ బాస్ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్లు.. రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించనున్న ముద్దుగుమ్మ

|

Dec 17, 2020 | 5:54 AM

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయినా వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా వచ్చిన ముద్దుగుమ్మలకు సినిమా ఛాన్సులు కూడా క్యూ కడుతుంటాయి.

బిగ్ బాస్  బ్యూటీకి అదిరిపోయే ఆఫర్లు.. రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించనున్న ముద్దుగుమ్మ
Follow us on

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయినా వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా వచ్చిన ముద్దుగుమ్మలకు సినిమా ఛాన్సులు కూడా క్యూ కడుతుంటాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ దివికి కుడా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. పలువురు దర్శక నిర్మాతలు ఈ అమ్మడి తో సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే కొంతమంది దివీని సంప్రదించారని తెలుస్తుంది. అలానే రెండు సినిమాల్లో హీరోయిన్ గా దివికి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. మరి ఈ చిన్నది ఎవరి సరసన హీరోయిన్ గా చేయబోతుందో చూడాలి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.