అభిజిత్‌ను ఆకాశానికి ఎత్తిన బిగ్‌బాస్… మెచ్చూర్డ్ మ్యాన్ ఆఫ్ ది హౌస్… బిగ్‌బాస్‌కే గర్వకారణం అని మెచ్చుకోలు

| Edited By:

Dec 17, 2020 | 10:43 AM

బిగ్‌బాస్ ఇంత వరకు చెప్పని విషయాన్ని అభిజిత్‌కు చెప్పాడు. బిగ్‌బాస్ ఏం చెప్పాడు... దానికి అభిజిత్ ఏం సమాధానమిచ్చాడో చదివేద్దామా...

అభిజిత్‌ను ఆకాశానికి ఎత్తిన బిగ్‌బాస్... మెచ్చూర్డ్ మ్యాన్ ఆఫ్ ది హౌస్... బిగ్‌బాస్‌కే గర్వకారణం అని మెచ్చుకోలు
Follow us on

డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ముగియనుంది. దీంతో బిగ్‌బాస్ బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్ల‌ను ఒక్కొక్క‌రిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్ర‌యాణాన్ని చూపిస్తున్నాడు. అభిజిత్ బిగ్ బాస్ జర్నీని చూపించారు. అయితే బిగ్‌బాస్ ఇంత వరకు చెప్పని విషయాన్ని అభిజిత్‌కు చెప్పాడు. బిగ్‌బాస్ ఏం చెప్పాడు… దానికి అభిజిత్ ఏం సమాధానమిచ్చాడో చదివేద్దామా…

ఇత‌రుల కోసం ఎక్కువ‌గా ఆలోచించావు…

అభిజిత్ బిగ్‌బాస్ పిలిచిన వెంటనే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి త‌న‌కు పేరు తెచ్చిన రోబో టాస్క్‌లోని వ‌స్తువుల‌ను త‌నివితీరా చూసుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ అత‌డికి “మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్” బిరుదునిచ్చాడు. నీ కంటే ఎక్కువ‌గా వేరేవాళ్ల‌కోసం ఆలోచించావ‌‌ని అభిని మెచ్చుకున్నాడు. ఇలాంటి ప‌రిప‌క్వ‌త చెందిన, తెలివైన కంటెస్టెంటు హౌస్‌లో ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని బిగ్‌బాస్ అన్నాడు. దీంతో అభి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తూ.. నేను బిగ్‌బాస్‌కు రావ‌డం అనేది నా జీవితంలోనే స‌రైన నిర్ణ‌యం అని భావిస్తున్నాను అని తెలిపాడు. అనంత‌రం అత‌డికి జ‌ర్నీ వీడియో చూపించ‌గా దాన్ని చూసి అభి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అభి – మోనాల్ మాటలు…

ఆ వీడియోలో అభి మోనాల్‌తో పెట్టిన క‌బుర్ల‌నే ఎక్కువ‌గా చూపించారు. అందులో‌ ‘నీకు నేనంటే ఇష్టం లేదా?’ అని అభి మోనాల్‌ను ప్ర‌శ్నించాడు. అప్పుడు దానికి మోనాల్ స‌మాధానం చెప్ప‌క‌పోయినా త‌ర్వాత మాత్రం ‘ఐ లైక్ యూ’ అని చెప్పింది. కానీ త‌ర్వాత మారిన ప‌రిస్థితుల వ‌ల్ల‌ ఆమెతో దూరం కావ‌డం, అఖిల్‌తో గొడ‌వ‌లు, నామినేష‌న్లు అన్నింటినీ చూపించారు. హారిక అత‌డికి తోడుగా నిలిచిన సంద‌ర్భాల‌ను సైతం గుర్తు చేశారు. ఇవ‌న్నీ చూసి చ‌లించిపోయిన‌ అభి ఎంతో సంతోషించాడు. త‌ర్వాత‌ త‌న ఫొటోను తీసుకుని లోప‌ల‌కు వెళ్లాడు.