గజ్వేల్ జర్నలిస్టులపై పెద్ద బాధ్యత… కేసీఆర్ ముందుచూపు

|

May 29, 2020 | 3:38 PM

తాను స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టుపై గురుతర బాధ్యత మోపారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. కనీవినీ ఎరుగని రీతిలో నియోజకవర్గంలో సాగునీటి కాల్వల నిర్మాణం జరుగుతున్న తరుణంలో....

గజ్వేల్ జర్నలిస్టులపై పెద్ద బాధ్యత... కేసీఆర్ ముందుచూపు
Follow us on

తాను స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టుపై గురుతర బాధ్యత మోపారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. కనీవినీ ఎరుగని రీతిలో నియోజకవర్గంలో సాగునీటి కాల్వల నిర్మాణం జరుగుతున్న తరుణంలో గురుతర బాధ్యత నిర్వహించాల్సి అవసరం వుందని స్థానిక జర్నలిస్టులపై వుందని సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతను కచ్చితంగా నెరవేరుస్తామని స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు.

కొండపోచమ్మ రిజర్వాయర్, మర్కూక్ ఎత్తిపోతలను ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ సాధిస్తున్న సాగునీటి, వ్యవసాయ రంగ పురోభివృద్ధిని వివరించిన ముఖ్యమంత్రి… చివరలో స్థానిక జర్నలిస్టులపై పెద్ద బాధ్యత మోపారు. గోదావరి నీటిని ఉమ్మడి మెదక్ జిల్లాకు తరలిస్తున్న క్రమంలో పెద్ద పెద్ద కాల్వల నిర్మాణం జరుగుతోందని, అందులో ఒకటి మర్కూక్ కాల్వ అని కేసీఆర్ తెలిపారు. 1150 క్యూసెక్కుల సామర్థ్యంతో ఒకటి, 7500 సామర్థ్యంతో మరొక కాల్వ నిర్మాణాలు జరుపుకున్నాయని ఆయన తెలిపారు.

ఈ కాల్వల ద్వారా శరవేగంతో దూసుకొచ్చే గోదావరి జలాల్లో జలకాలాడేందుకు స్థానిక యువత పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తోందని కేసీఆర్ అన్నారు. అది అత్యంత ప్రమాదకరమన్న విషయంపై గజ్వేల్ జర్నలిస్టులు ప్రత్యేకంగా ప్రచారం చేయాలని, పెద్ద ఎత్తున కథనాలు రాయాలని ముఖ్యమంత్రి లోకల్ మీడియాకు సూచించారు. కొడగండ్ల కెనాల్ చాలా పెద్దదని, అది ఉధృతంగా ప్రవహిస్తుందని అందులో ఈత కొట్టడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయొద్దని ముఖ్యమంత్రి సూచించారు.