చంద్రబాబుకు లోకేష్ సొంతపుత్రుడు.. పవన్ దత్తపుత్రుడుః విజయసాయిరెడ్డి

| Edited By:

Oct 30, 2019 | 6:11 AM

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేసుల భయంతో టీడీపీ నేతలను చంద్రబాబు వైసీపీలోకి పంపిస్తున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. సుజనా చౌదరి నుంచి వల్లభనేని వంశీ వరకు ఇదే ధోరణి అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు సొంతపుత్రుడు లోకేష్ అయితే.. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్నారు. సొంతపుత్రుడు ఒక స్థానంలో మంగళగిరిలో ఓడిపితే .. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో […]

చంద్రబాబుకు లోకేష్ సొంతపుత్రుడు.. పవన్ దత్తపుత్రుడుః విజయసాయిరెడ్డి
Follow us on

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేసుల భయంతో టీడీపీ నేతలను చంద్రబాబు వైసీపీలోకి పంపిస్తున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. సుజనా చౌదరి నుంచి వల్లభనేని వంశీ వరకు ఇదే ధోరణి అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు సొంతపుత్రుడు లోకేష్ అయితే.. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్నారు.

సొంతపుత్రుడు ఒక స్థానంలో మంగళగిరిలో ఓడిపితే .. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పరాజయం పొందారని విజయసాయిరెడ్డి సైటర్లు వేశారు. చంద్రబాబు ఎన్ని స్వార్ధ రాజకీయాలు చేసినా.. ఇద్దరూ గెలవలేదన్నారు. తెలుగుదేశాన్ని చంద్రబాబే గొంతుపిసికి చంపేస్తున్నారని.. సొంత పార్టీ నేతలను బీజేపీకి ధారాదత్తం చేస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయిందని.. ఇప్పటికే మేనిఫెస్టోలోని 80% అంశాలను సీఎం జగన్ అమలు చేశారని విజయసాయిరెడ్డి అన్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ మీద వస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. తన పార్టీని ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ ఏమి చేయలేదన్నారు. దొంగ కేసులకు భయపడేది లేదని.. తాను ఏ తప్పు చేయలేదని వైసీపీ ఆరోపణలకు చంద్రబాబు ధీటుగా బదులిచ్చారు.

ఇలా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై బిగ్ న్యూస్.. బిగ్ డిబేట్‌లో ఎటువంటి చర్చ జరిగిందో చూద్దాం..