బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఇంగ్లీష్ హీరో నువ్వా నేనా!

| Edited By:

Dec 12, 2019 | 10:45 PM

ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్‌ మీడియం క్రెడిట్‌ కోసం టీడీపీ, వైసీపీ మధ్య కొత్త ఫైట్‌ మొదలైంది. సర్కారీ బడుల్లో ఇంగ్లీష్‌ను తామే ప్రవేశపెట్టామంటూ టీడీపీ చెప్పుకుంటే, 66 శాతం స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ ఎందుకు లేదంటూ వైసీపీ సర్కార్‌ నిలదీసింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చినందువల్లే ఇంగ్లీష్‌ మీడియంపై టీడీపీ యూటర్న్‌ తీసుకుంటుందని ఏపీ సీఎం జగన్‌ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లీష్‌పై పొలిటికల్‌ యుద్ధం, ఇంగ్లీష్‌ మీడియం అమలు సవాళ్లపైనే ఇవాళ్టి బిగ్‌ డిబేట్‌. ఏపీ ప్రభుత్వ బడుల్లో […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఇంగ్లీష్ హీరో నువ్వా నేనా!
Follow us on

ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్‌ మీడియం క్రెడిట్‌ కోసం టీడీపీ, వైసీపీ మధ్య కొత్త ఫైట్‌ మొదలైంది. సర్కారీ బడుల్లో ఇంగ్లీష్‌ను తామే ప్రవేశపెట్టామంటూ టీడీపీ చెప్పుకుంటే, 66 శాతం స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ ఎందుకు లేదంటూ వైసీపీ సర్కార్‌ నిలదీసింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చినందువల్లే ఇంగ్లీష్‌ మీడియంపై టీడీపీ యూటర్న్‌ తీసుకుంటుందని ఏపీ సీఎం జగన్‌ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లీష్‌పై పొలిటికల్‌ యుద్ధం, ఇంగ్లీష్‌ మీడియం అమలు సవాళ్లపైనే ఇవాళ్టి బిగ్‌ డిబేట్‌.

ఏపీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం చదువులపై బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు, సెటైర్లు, సమాధానాల తర్వాత గురువారం ఇదే అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభా నాయకుడు జగన్‌, ప్రతిపక్ష నేత మధ్య తీవ్రస్థాయి వాదోపవాదాలు జరిగాయి. 2017లో తాము ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టినపుడు వ్యతిరేకించిన జగన్‌, ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేయడం ఏమిటని చంద్రబాబు నిలదీశారు. తాను ఇంగ్లీష్‌ను వ్యతిరేకించినట్లు నిరూపించగలుగుతారా అని జగన్‌ సవాల్‌ విసిరారు.

తమ ప్రభుత్వ హయాంలో బ్రిటీష్‌ కౌన్సిల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని లక్ష మందికి ట్రైనింగ్‌ ఇప్పించామని చంద్రబాబు చెబితే, అదంతా పెద్ద కుంభకోణమనీ, దీనిపై విచారణ జరుగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. అదే సమయంలో- ఇంగ్లీష్‌ మీడియాన్ని టీడీపీ సమర్థిస్తుందని చంద్రబాబు చెప్పారు. అయితే, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆప్షన్‌ ఇవ్వాలని ఆయన సూచించారు.