భారత్ బంద్‌తో హైదరాబాద్ పోలీసుల అప్రమత్తం.. నగరంలో భారీ బందోబస్తు.. హద్దు మీరితే ఇక అంతే.!

|

Dec 08, 2020 | 10:15 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్‌ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.

భారత్ బంద్‌తో హైదరాబాద్ పోలీసుల అప్రమత్తం.. నగరంలో భారీ బందోబస్తు.. హద్దు మీరితే ఇక అంతే.!
Follow us on

Bharat Bandh Hyderabad Police: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్‌ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఐదు జోన్‌‌లకు ముగ్గురు అడిషనల్ సీపీలు, జాయింట్ సీపీలను ఇంచార్జ్‌లుగా నియమించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రాంతంలోనూ అత్యవసర వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు డీజీపీ సూచనలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, జనసమితి, ఎంఐఎం పార్టీలు భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు పాతబస్తీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

Also Read: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..