మీకు తలనొప్పి రెగ్యులర్‌గా వస్తోందా?..ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లినా..ఎన్ని రకాల మందులు వేసుకున్నా ఫలితం శూన్యంమా..? అయితే బీ అలర్ట్..వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి బ్రెయిన్‌కి సంబంధించిన అడ్వాన్స్‌డ్ టెస్ట్‌లు చేయించుకోండి. ఎందుకంటే బ్రెయిన్‌లో ‘టేప్ వార్మ్’ లు తిష్ట వేసి ఉండవచ్చు. ఇంకా కుదిరితే గుడ్లు కూడా పెట్టొచ్చు.
సరిగ్గా ఉడకని లేదా పచ్చి మాంసం తినడం ద్వారా మన శరీరంలోకి టేప్ వార్మ్‌లు వెళ్లే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక ఆ టేప్ వార్మ్ శరీరంలో చాల ఫ్రీగా, ఉత్సాహంగా తిరుగే అవకాశం ఉందట. ఇక టైం బాగలేకపోతే ఆ జీవి బ్రెయిన్ వరకు చేరడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. అలా జరిగితే వెన్నుపూస నుంచి స్పైనల్ ప్లూయిడ్ బ్రెయిన్ వరకు చేరడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రాణలకే ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. చైనా, అమెరికా లాంటి కంట్రీస్‌లో ఇటువంటి కేసులు చాలా నమోదయ్యాయి.
ఇక గర్బివతులు.. మాంసం తినే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. సరిగ్గా ఉడకని మాంసం తినడం వల్ల టోక్సోప్లాస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చి బేబీ మెదడు పెరుగుదలను దెబ్బతీస్తుంది. పిల్లలకు అంధత్వం కలిగే అవకాశం ఉంది. ఇక సరిగ్గా ఉడికి, ఉడకని చికెన్ తినడం వలన పక్షవాతం వచ్చే అవకాశాల ఎక్కువగా ఉన్నాయి. సో మాంసం తినే విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడం అవసరం.