టెన్త్ ఎగ్జామ్స్ గురించి త‌ప్పుడు ప్రచారం..అవ‌న్నీ న‌మ్మ‌కండి..

|

May 09, 2020 | 9:53 PM

ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ కి సంబంధించి షెడ్యూల్ తో సహా సోష‌ల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుందని.. అదంతా ఫేక్ అని పాఠశాల విద్యాశాఖ మిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. ఇవాళ తన సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ మరో షెడ్యూల్ సోష‌ల్ మీడియాలో వచ్చిందన్నారు. పదో తరగతి ఎగ్జామ్స్ పై ఇప్పటిదాకా గ‌వ‌ర్న‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి రూమ‌ర్స్ ఎవరో కావాలని సృష్టిస్తున్నారన్న కమిషనర్.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు […]

టెన్త్ ఎగ్జామ్స్ గురించి త‌ప్పుడు ప్రచారం..అవ‌న్నీ న‌మ్మ‌కండి..
Follow us on

ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ కి సంబంధించి షెడ్యూల్ తో సహా సోష‌ల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుందని.. అదంతా ఫేక్ అని పాఠశాల విద్యాశాఖ మిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. ఇవాళ తన సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ మరో షెడ్యూల్ సోష‌ల్ మీడియాలో వచ్చిందన్నారు. పదో తరగతి ఎగ్జామ్స్ పై ఇప్పటిదాకా గ‌వ‌ర్న‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి రూమ‌ర్స్ ఎవరో కావాలని సృష్టిస్తున్నారన్న కమిషనర్.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పటికే మానసిక సంఘర్షణలో ఉన్నారన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాల వల్ల వారు మరింత ఒత్తిడికి గురవుతారని చెప్పారు.