‘ క్లైమేట్ పిల్ల ‘ కు నోబెల్ శాంతి బహుమతి ? బెట్టింగుల జోరు !

| Edited By: Srinu

Oct 09, 2019 | 6:31 PM

స్వీడిష్ టీనేజర్, క్లైమేట్ ఛేంజ్ పై ప్రపంచ వ్యాప్త ఉద్యమం ప్రారంభించిన 16 ఏళ్ళ గ్రెటా థన్ బెర్గ్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ ఆమెకు తప్పక లభిస్తుందని బుక్ మేకర్స్ (పందెం రాయుళ్లు కొందరు) విశ్వాసం ప్రకటిస్తున్నారు. కానీ మరికొంతమంది వారితో విభేదిస్తున్నారు. గ్రెటాకు ఇదివరకే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు, రైట్ లైవ్ లీ అవార్డు వచ్చాయని, మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. […]

 క్లైమేట్ పిల్ల  కు నోబెల్ శాంతి బహుమతి ? బెట్టింగుల జోరు !
Follow us on

స్వీడిష్ టీనేజర్, క్లైమేట్ ఛేంజ్ పై ప్రపంచ వ్యాప్త ఉద్యమం ప్రారంభించిన 16 ఏళ్ళ గ్రెటా థన్ బెర్గ్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ ఆమెకు తప్పక లభిస్తుందని బుక్ మేకర్స్ (పందెం రాయుళ్లు కొందరు) విశ్వాసం ప్రకటిస్తున్నారు. కానీ మరికొంతమంది వారితో విభేదిస్తున్నారు. గ్రెటాకు ఇదివరకే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు, రైట్ లైవ్ లీ అవార్డు వచ్చాయని, మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రైట్ లైవ్ లీ అవార్డు అన్నది ఒకవిధంగా నోబెల్ బహుమతి లాంటిదే అన్నది వారి వాదన. (నార్వేలో ఈ వారంలోనే నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు). ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అయిన ఇది గ్రెటాకే లభిస్తుందని ‘ ల్యాడ్ బ్రోక్స్ ‘ వంటి ఆన్ లైన్ బెట్టింగ్ సైట్స్ లో బెట్టింగులు కాస్తున్నారు చాలామంది. ఆమె ఇందుకు అన్ని విధాలా అర్హురాలన్నది వారి నమ్మకం.
గత ఆగస్టులో గ్రెటా .. ఓ స్విస్ బ్రాడ్ కాస్టర్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో .. ఈ అవార్డు తనకు వస్తే అది తాను లాంచ్ చేసిన ఉద్యమానికి గుర్తింపునిచ్చినట్టే అని పేర్కొంది. తాము ఇలాంటి అవార్డులకోసం ఉద్యమం చేయడంలేదని గ్రెటాతో బాటు ఆమె ఫ్రెండ్స్ కూడా నిక్కచ్చిగా చెబుతున్నారు.

క్లైమేట్ ఛేంజ్ పై గత ఏడాది ఈమె స్వీడన్ పార్లమెంట్ ముందు ప్రతి శుక్రవారం ఆందోళన ప్రారంభించింది. ‘ స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్ ‘ అని రాసి ఉన్న సైన్ బోర్డు పట్టుకుని తన ఉద్యమానికి నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన ఈ అమ్మాయి కొద్దికాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది యువతను ఆకట్టుకోగలిగింది. గ్రెటా ఆందోళనకు పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతు పలికారు. వివిధ నగరాల్లో ప్రదర్శనలు చేశారు. గత సెప్టెంబరులో న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమిత్జిలో క్లైమేట్ ఛేంజ్ పై జరిగిన సదస్సులో ఈమె ప్రపంచ నేతలను సైతం వణికించింది. ట్రంప్ వంటి అగ్రరాజ్యాధినేతను కూడా ఈ చిన్నది చెమటలు పట్టించింది.

కాగా-గ్రెటా థన్ బెర్గ్ కు నోబెల్ బహుమతి రాకపోవచ్ఛునని ఓస్లో లోని పీస్ రీసెర్చ్ ఇన్స్ టి ట్యూట్ డైరెక్టర్ హెన్రిక్ ఉర్దల్ అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు సాయుధ ఘర్షణకు కారణమవుతాయన్నదానిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని ఆయన తెలిపారు. పైగా ఈ అమ్మాయిది చిన్న వయస్సు.. ఆమెకు రివార్డు కన్నా ఇది ఎక్కువ భారం (బర్డెన్) కావచ్ఛు ‘ అని వ్యాఖ్యానించారు.
నార్వేకు చెందిన చరిత్రకారుడు యాస్లే స్వీన్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ.. గ్రెటా ఈ అవార్డుకు అర్హురాలేనని స్టాక్ హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్ టి ట్యూట్ డైరెక్టర్ డాన్ స్మిత్ పేర్కొన్నారు. ఏమైనా-ఈ 16 ఏళ్ళ బాలికకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే అది అంతర్జాతీయంగా ‘ బాలల ప్రపంచానికి ‘ గర్వకారణమే !