దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై తేనెటీగల దాడి..జనగామ జిల్లాలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో ఘటన

|

Dec 22, 2020 | 2:27 PM

దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. పుణ్యం మాట దేవుడెరుగు కానీ, బ్రతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి తప్పించుకున్నారు.

దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై తేనెటీగల దాడి..జనగామ జిల్లాలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో ఘటన
Follow us on

దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. పుణ్యం మాట దేవుడెరుగు కానీ, బ్రతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి తప్పించుకున్నారు. ఘటనలో పలువురుకి తీవ్ర గాయలవ్వగా..వెంటనే ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటన జనగామ జిల్లాలోని శ్రీ సోమేశ్వర ఆలయంలో సోమవారం చోటు చేసుకుంది.  పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామీ ఆలయనికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం కావటంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేయించుకున్నారు. ఈ క్రమంలో గుడికి వచ్చిన భక్తులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.

స్వామివారిని దర్శించుకుని, గర్భగుడి నుండి పూజలు, మొక్కులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్న సమయంలో తేనెటీగలు చుట్టుముట్టి దాడి చేశాయి. సుమారు పది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుల్ని వైద్యం కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read : 

కరోనా సమయంలోనూ భారీ కానుకలు..అన్నవరం సత్యదేవుని దేవస్థాన కార్తిక మాస ఆదాయం ఎంతో తెలుసా..?

Lpg Gas Price: కీలక నిర్ణయం దిశగా ఆయిల్ కంపెనీలు..ఇకపై ప్రతి వారం మారనున్న సిలిండర్ ధర !

ఏకంగా రూ. 3 కోట్ల 86 లక్షల బకాయిలు..పుట్టపర్తి మున్సిపల్‌ కార్యాలయానికి పవర్‌ కట్..ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు‌