తేనెటీగల దాడిలో అసువులుబాసిన 25 మూగ జీవాలు.. కర్నూలు జిల్లాలో ఘటన

|

Dec 04, 2020 | 5:26 AM

తేనెటీగలు దాడి చెయ్యడంతో 25 ముగ జీవాలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కల్లురు మండలం రేమడూరు గ్రామంలోని..

తేనెటీగల దాడిలో అసువులుబాసిన 25 మూగ జీవాలు.. కర్నూలు జిల్లాలో ఘటన
Follow us on

తేనెటీగలు దాడి చెయ్యడంతో 25 మూగ జీవాలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కల్లురు మండలం రేమడూరు గ్రామంలోని ఐదుగురు రైతులకు చెందిన గొర్రెలు, మేకలు గ్రామ సమీపంలో చేనులో ఉండగా వాటిపై ఒక్కసారిగా తేనె టీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో 17 గొర్రెలు, 8 మేకలు చనిపోయాయి. మేకలతో పాటు అక్కడే ఉన్న వ్యక్తులపై కూడా తేనెటీగలు దాడిచెయ్యడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.