బీర్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తున్నారా.. బీ అలర్ట్..!

| Edited By:

Jul 22, 2019 | 8:38 AM

ఈ మధ్యకాలంలో ఏది కావాలన్నా ఇంటి దగ్గరకే వచ్చేస్తుంది. అలా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు. కాని బీర్ కోసం గూగుల్ సెర్చ్ చేశారా ఇక అంతే..! మద్యం కోసం గూగుల్ సెర్చ్ చేసేవారిని సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేశారు. మద్య కోసం సర్చ్ చేసి కొంత మంది సైబర్ మాయగాళ్ల బారినపడి వేలాది రూపాయలను పోగొట్టుకున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువైపోయాయని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది డోర్ డెలివరీ సర్వీస్ చేస్తామని నమ్మించి.. […]

బీర్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తున్నారా.. బీ అలర్ట్..!
Follow us on

ఈ మధ్యకాలంలో ఏది కావాలన్నా ఇంటి దగ్గరకే వచ్చేస్తుంది. అలా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు. కాని బీర్ కోసం గూగుల్ సెర్చ్ చేశారా ఇక అంతే..! మద్యం కోసం గూగుల్ సెర్చ్ చేసేవారిని సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేశారు. మద్య కోసం సర్చ్ చేసి కొంత మంది సైబర్ మాయగాళ్ల బారినపడి వేలాది రూపాయలను పోగొట్టుకున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువైపోయాయని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది డోర్ డెలివరీ సర్వీస్ చేస్తామని నమ్మించి.. బ్యాంక్‌కు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డు యూపీఐ వివరాలను సేకరిస్తున్నారు. ఇలా వివరాలు సేకరించి.. ఆన్ లైన్ ట్రాన్సఫర్‌తో పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం మాదాపూర్‌కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి. ఫుల్ బాటిల్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అందులో దొరికిన ఓ నంబరుకు ఫోన్ చేస్తే డెలివరీ చేస్తామనడంతో.. ఆర్డర్ చేశారు. అయితే ముందుగా డబ్బులు చెల్లించాలని ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి చెప్పడంతో.. అతని ఫోన్ కి కనెక్ట్ అయి ఉన్న యూపీఐ యాప్‌కి పంపిస్తున్నామని చెప్పాడు. ఆ తర్వాత అతను మళ్లీ ఫోన్ చేసి డబ్బులు రాలేదని.. యూపీఐ ఐడీ నంబర్, పిన్ నంబర్‌తో పాటు ఓటీపీ కూడా తెలుసుకున్నాడు. ఇంకేముంది నిమిషాల్లోనే బాధితుడి ఖాతా నుంచి రూ.30వేలు ఖాళీ అయ్యాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా డోర్ డెలివరీ కోసం లిక్కర్ సెర్చ్ చేసుకుని మోసిపోయిన ఫిర్యాదులు పదుల సంఖ్యలో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.