Bank Fraud Case: టిడిపి నేత షణ్ముగంకు బిగుస్తోన్న ఉచ్చు

| Edited By: Pardhasaradhi Peri

Feb 14, 2020 | 8:27 PM

Bank Fraud Case : టిడిపి నేత, చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంకు ఉచ్చు బిగిస్తోంది. తన హయాంలో బ్యాంకులో మోసాలకు పాల్పడిన విషయంపై  ఇప్పటికే అతనిపై చిత్తూరు వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది.  బ్యాంకులో బినామీల పేర 12 ఖాతాలను తెరిచి,  నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టిన షణ్ముగం…కోటి ఇరవై లక్షల రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..పరారీలో ఉన్న […]

Bank Fraud Case: టిడిపి నేత షణ్ముగంకు బిగుస్తోన్న ఉచ్చు
Follow us on

Bank Fraud Case : టిడిపి నేత, చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంకు ఉచ్చు బిగిస్తోంది. తన హయాంలో బ్యాంకులో మోసాలకు పాల్పడిన విషయంపై  ఇప్పటికే అతనిపై చిత్తూరు వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది.  బ్యాంకులో బినామీల పేర 12 ఖాతాలను తెరిచి,  నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టిన షణ్ముగం…కోటి ఇరవై లక్షల రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..పరారీలో ఉన్న షణ్ముగం కోసం గాలిస్తున్నారు. బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఇంత భారీ స్కామ్ జరిగే అవకాశం లేకపోవడంతో..వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకున్న 4 బ్రాంచీల్లోని ఖాతాలను పరిశీలించారు. ఒక్క దర్గా బ్రాంచ్ బ్యాంకులోనే 12 ఖాతాల్లో 39 అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఫేక్  ఖాతాదారులందర్నీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో జరిగిన బ్యాంకు అక్రమాలను బయటకు తీసేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్.