డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్.. తదుపరి కార్యాచరణపై జాతీయ నేతలతో చర్చలు..

|

Dec 05, 2020 | 4:46 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ పర్యటనలో ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో..

డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్.. తదుపరి కార్యాచరణపై జాతీయ నేతలతో చర్చలు..
Bandi Sanjay
Follow us on

Bandi Sanjay Delhi Tour: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ పర్యటనలో ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వివరాలను వెల్లడించనున్నారు. చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, స్మృతీ ఇరానీతో సహా పలువురికి ధన్యవాదాలు తెలుపనున్నారు.

కాగా, గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్ 55 సీట్లలో విజయం సాధించగా.. బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాలు విజయం సాధించాల్సి ఉండగా.. ఒక్క పార్టీ కూడా మేజిక్ ఫిగర్ 60 దాటాకపోవడంతో హాంగ్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చిస్తారని సమాచారం.

Also Read:

Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. ప‌నికి రానోళ్ల‌ను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్

డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..