ఆ స్టేషన్‌లో అరటిపండ్లు బ్యాన్.. అమ్మితే జైలుకే!

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 9:23 AM

అరటిపండ్లు.. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తూ.. ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. తక్కువ ధరలో బాగా ఆకలేసినప్పుడు తినడానికి వీలుగా ఉంటుంది. రెండు అరటిపండ్లు తింటే చాలు ఆకలి ఇట్టే మాయమవుతుంది. అలాంటి అరటిపండ్లను ఓ రైల్వే స్టేషన్‌లో అమ్మితే.. ఏకంగా జైలు పాలవుతారట. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో ఇకపై అరటిపండ్లు అమ్మకాలు జరగవు. ఒకవేళ అరటిపండు కావాలన్నా.. బయటికి వెళ్లి కొనుక్కొని తినాల్సిందే. అంతేకాకుండా దాని తొక్క కూడా ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. అలా […]

ఆ స్టేషన్‌లో అరటిపండ్లు బ్యాన్.. అమ్మితే జైలుకే!
Follow us on

అరటిపండ్లు.. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తూ.. ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. తక్కువ ధరలో బాగా ఆకలేసినప్పుడు తినడానికి వీలుగా ఉంటుంది. రెండు అరటిపండ్లు తింటే చాలు ఆకలి ఇట్టే మాయమవుతుంది. అలాంటి అరటిపండ్లను ఓ రైల్వే స్టేషన్‌లో అమ్మితే.. ఏకంగా జైలు పాలవుతారట.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో ఇకపై అరటిపండ్లు అమ్మకాలు జరగవు. ఒకవేళ అరటిపండు కావాలన్నా.. బయటికి వెళ్లి కొనుక్కొని తినాల్సిందే. అంతేకాకుండా దాని తొక్క కూడా ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ స్టేషన్‌లో అరటిపండ్ల అమ్మకాలను నిషేదించారు. అరటిపండ్లు తినేసి తొక్కలు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారట.  దీంతో స్టేషన్ పాడైపోతున్నది.  అందుకే ఇలాంటి వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అధికారుల తీరుపై వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరటిపండ్లు, వాటి తొక్కలతో పర్యావరణానికి ఎలాంటి హానీ లేదని, ముందుగా  ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్లను బ్యాన్ చేయాలంటూ సూచిస్తున్నారు.