ఆ దాడి చేసింది మేమే.. బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ ప్రకటన..

| Edited By:

Jun 29, 2020 | 5:00 PM

సోమవారం ఉదయం కరాచీలోని స్టాక్‌ మార్కెట్‌ బిల్డింగ్‌పై దాడి చేసింది తామేనంటూ బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ మెయిల్‌ ద్వారా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

ఆ దాడి చేసింది మేమే.. బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ ప్రకటన..
Follow us on

సోమవారం ఉదయం కరాచీలోని స్టాక్‌ మార్కెట్‌ బిల్డింగ్‌పై దాడి చేసింది తామేనంటూ బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ మెయిల్‌ ద్వారా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా బలూచిస్థాన్‌ కోసం ఈ బీఎల్‌ఏ సంస్థ పోరాడుతన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాడు కరాచీ స్టాక్ మార్కెట్‌ బిల్డింగ్‌ వద్ద గ్రేనేడ్‌తో ఎటాక్ చేశారు. ఈ ఘటనలో మొత్తం పదకొండు మంది మరణించారు. వీరిలో పలువురు పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్‌, నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే కరాచీ స్టాక్ మార్కెట్ బిల్డింగ్‌ను అదుపులోకి తీసుకుని.. మొత్తం నలుగురు ఉగ్రవాదుల్ని హతమార్చారు. కాగా, గత కొద్ది రోజులుగా పాక్‌లో ఎక్కడో ఓ చోట ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ దాడులు జరుపుతుండగా.. మరోవైపు సింధుస్థాన్‌ రెవెల్యూషన్ ఆర్మీ కూడా పాక్ పోలీసులు, రేజంర్లు టార్గెట్‌గా వరుస దాడులకు పాల్పడుతున్నారు.