కాళ్ల గజ్జెలు విప్పిన ‘గద్దర్ @ 73’.. జాబ్‌ కోసం లెటర్..!

| Edited By: Ram Naramaneni

Dec 04, 2019 | 9:31 PM

73 ఏళ్ల వయసులో.. ఓ జాబ్‌కి ప్రముఖ గాయకుడు గద్దర్ అప్లై చేశారు. అది కూడా.. తన లెటర్‌ ప్యాడ్‌పై లేఖ రాస్తూ.. ‘తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడి’ ఉద్యోగానికి.. గద్దర్ దరఖాస్తు చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉన్న కార్యాలయానికి నిన్న గద్దర్ స్వయంగా వెళ్లి.. ఆ జాబ్‌కి దరఖాస్తు చేశారు. అయితే.. ఆయన తన లెటర్ ప్యాడ్‌లో.. సదరు అధికారులకు.. లెటర్ రాయడం గమనార్హం. ‘తనకు 73 ఏళ్ల వయసని.. తనకు పాటలు పాడటం, రాయడం […]

కాళ్ల గజ్జెలు విప్పిన గద్దర్ @ 73’.. జాబ్‌ కోసం లెటర్..!
Follow us on

73 ఏళ్ల వయసులో.. ఓ జాబ్‌కి ప్రముఖ గాయకుడు గద్దర్ అప్లై చేశారు. అది కూడా.. తన లెటర్‌ ప్యాడ్‌పై లేఖ రాస్తూ.. ‘తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడి’ ఉద్యోగానికి.. గద్దర్ దరఖాస్తు చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉన్న కార్యాలయానికి నిన్న గద్దర్ స్వయంగా వెళ్లి.. ఆ జాబ్‌కి దరఖాస్తు చేశారు. అయితే.. ఆయన తన లెటర్ ప్యాడ్‌లో.. సదరు అధికారులకు.. లెటర్ రాయడం గమనార్హం. ‘తనకు 73 ఏళ్ల వయసని.. తనకు పాటలు పాడటం, రాయడం వృత్తి అని.. అయితే.. తాను ఇంజినీరింగ్ విద్యను అభ్యసించినట్టు.. కానీ తన దగ్గర ఎలాంటి సర్టిఫికేట్లు లేవని’ ఓ లేఖ రాశారు గద్దర్.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని.. పాటకు, కళకు, అక్షరానికి, వయసు, కులం, ప్రాంతానికి సంబంధం ఉండదన్నారు. నేను కోరుకున్నది కూడా కళాకారుని ఉద్యోగమేనని.. ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించేందుకు అవకాశం కూడా వస్తుందనే నేను ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశానని వెల్లడించారు. దయచేసి అందరూ నా కోసం కొట్లాడి.. ఉద్యోగం ఇప్పించాలన్నారు. 73 ఏళ్ల వయసులో నేను ఆడి, పాడకపోయినా పరవాలేదు. ఇప్పుడున్న కళాకారులు పాడుతుంటే.. వాళ్ల వద్ద డప్పులు మోస్తానన్నారు. కాగా.. నేను ఉద్యోగం గురించి దరఖాస్తు పెట్టుకున్న అంశంపై చర్చ జరుగుతుండటం నాకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు గద్దర్.