ఆశయ సాధనలో తోడ్పడిన అందరికీ ధన్యవాదాలు – బాలకృష్ణ

|

Jun 22, 2020 | 6:56 PM

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ఇవాళ్టితో (జూన్ 22) 20 వసంతాలు పూర్తి చేసుకుందని ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నంద‌మూరి బాలకృష్ణ అన్నారు...

ఆశయ సాధనలో తోడ్పడిన అందరికీ ధన్యవాదాలు - బాలకృష్ణ
Follow us on

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి వెనక ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నంద‌మూరి బాలకృష్ణ తెలియజేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ఇవాళ్టితో (జూన్ 22) 20 వసంతాలు పూర్తి చేసుకుందని ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నంద‌మూరి బాలకృష్ణ అన్నారు.

నాడు దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి చేతుల‌మీదుగా ప్రారంభమైనట్లు గుర్తు చేసుకున్నారు.  ఇక్కడ సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై బసవతారకం ఆస్పత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

క్యాన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు 2.5 లక్షల వరకు క్యాన్సర్ రోగులకు ఈ హాస్పిటల్ నుంచి వైద్య చికిత్స చేయడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాట్లుగా గుర్తు చేసుకున్నారు. చాలా మంది సహకారంతో.. నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేసి ఈ ఆసుపత్రి ని ఉత్తమమైన క్యాన్సర్ హాస్పిటల్ గా తీర్చిదిద్దామని వెల్లడించారు.