కాసేపట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల

|

Aug 06, 2020 | 3:24 PM

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు మరి కాసేపట్లో విడుదల కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కడప జైలు నుంచి విడుదల అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. 54 రోజుల పాటు జైలులో గడిపిన జేసీ తండ్రి కొడుకులకు ఎస్సీ , ఎస్టీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాసేపట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల
Follow us on

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు మరి కాసేపట్లో విడుదల కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కడప జైలు నుంచి విడుదల అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. 54 రోజుల పాటు జైలులో గడిపిన జేసీ తండ్రి కొడుకులకు ఎస్సీ , ఎస్టీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  ఇదిలావుంటే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. వారిపై నమోదైన మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. తాడిపత్రిని వదిలి ఎక్కడకూ వెళ్లకూడదని షరతు విధించింది. వాహనాల రిజిస్ట్రేషన్ స్కాంలో జూన్ 13న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో వీరిద్దరూ ఉన్నారు. మరోవైపు, అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది. జైలు నుంచి విడుదలవుతున్న జేసీ ప్రభాకరరెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.