లాక్ డౌన్ కారణంగా ఆటకుదూరమై.. తిరిగి బరిలో దిగనున్న భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్

|

Dec 22, 2020 | 9:51 PM

లాక్ డౌన్ కారణంగా ఆటకు దూరమైన భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తిరిగి బరిలోకి దిగనున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఆటకుదూరమై.. తిరిగి బరిలో దిగనున్న భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్
Follow us on

లాక్ డౌన్ కారణంగా ఆటకు దూరమైన భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తిరిగి బరిలోకి దిగనున్నారు. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ సహా బ్యాంకాక్‌లో జరిగే మూడు టోర్నీల్లో సింధు సైనా పాల్గొననున్నారు. జనవరి 12 నుంచి 17 వరకు యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌, 19 నుంచి 24 వరకు టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌, 27 నుంచి 31 వరకు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ జరుగనున్నాయి. వీటిల్లో భారత క్రీడాకారులు తలపడనున్నారు. అయితే రానున్న ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ను దృష్టిలో ఉంచుకొని మొత్తం ఎనిమిది మందితో కూడిన బృందాన్ని బాయ్ సోమవారం ప్రకటించింది. ఈ ఎనిమిది మందిలో సైనా, సింధూలతో పాటుగా పాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, అశ్వినీ పొన్నప్ప, సిక్కిరెడ్డీలు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో కరోనా లాక్‌డౌన్‌ తర్వాత శ్రీకాంత్‌ తప్ప మిగతా టాప్‌ షట్లర్లు ఎవరూ బరిలోకి దిగలేదు.