తల్లికి కరోనా నెగిటివ్.. నవజాత శిశువుకు పాజిటివ్..

| Edited By:

Jul 12, 2020 | 2:16 AM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల గర్భిణీ మహిళ జూన్ 11న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో

తల్లికి కరోనా నెగిటివ్.. నవజాత శిశువుకు పాజిటివ్..
baby girl eating rat killer
Follow us on

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల గర్భిణీ మహిళ జూన్ 11న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కరోనాతో చేరింది. ఆమె నుంచి భర్తకు కూడా సోకడంతో ఆయన కూడా అదే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఆ మహిళకు జూన్ 25న మరోసారి పరీక్ష చేయగా.. మళ్లీ పాజిటివ్ వచ్చింది. దాంతో మరికొన్ని రోజులు ఆగి.. జూలై 7న మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కరోనా టెస్ట్ చేశారు. అప్పుడు కరోనా నెగిటివ్ వచ్చింది.

ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో మరుసటి రోజే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టిన ఆరు గంటల తర్వాత.. కరోనా టెస్ట్ కోసం వైద్యులు బిడ్డ నుంచి శాంపిల్ తీసుకున్నారు. ఆ శాంపిల్ లో బిడ్డకు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. తల్లికి కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతే బిడ్డ పుట్టింది.. అటువంటిది బిడ్డకు పాజిటివ్ ఎలా వచ్చిందని ఆలోచనలో పడ్డారు. పిల్లలకి బొడ్డు తాడు ద్వారా కూడా కరోనా సోకుతుందని చైనాలో జరిపిన పరిశోధనలలో తేలింది. కానీ, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఇప్పటికైతే లేవు.