Breaking : బాబ్రీ మసీదు కేసు కొట్టివేత, అందరూ నిర్దోషులే

|

Sep 30, 2020 | 12:58 PM

సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేతలు ఎకే అద్వాణీ, మురళీమనోహర్​ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్....

Breaking : బాబ్రీ మసీదు కేసు కొట్టివేత, అందరూ నిర్దోషులే
Follow us on

సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేతలు ఎకే అద్వాణీ, మురళీమనోహర్​ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్ ప్రస్తుత రామాలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ సహా మొత్తం 32 మందిని నిర్దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. బాబ్రీ మసీదు కేసులో నిందితులందరిపై అభియోగాలు కొట్టివేసింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. కూల్చివేతను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు చివరి వరకు ప్రయత్నించారని తెలిపింది. ఈ తీర్పుతో 28 ఏళ్ల తర్వాత బీజేపీ అగ్రనేతలకు ఊరట లభించింది. తీర్పు నేపథ్యంలో జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కు పారా మిలటరీ బలగాలు భద్రత కలిపిస్తున్నాయి.

Also Read :

కాంగో ఫీవర్, మహారాష్టకు మరో ముప్పు !

టీటీడీ అర్చకునికి 6 నెలల జైలు శిక్ష