“కరోనా క‌ట్ట‌డిలో…ఆయుర్వేదం కీల‌క‌పాత్ర‌”

| Edited By: Pardhasaradhi Peri

Apr 06, 2020 | 3:29 PM

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. డెవ‌ల‌ప్పుడ్ కంట్రీస్ కూడా ఈ మ‌హమ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నాయి. ఇంత‌వ‌ర‌కు ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ కు మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ అందుబాటులోకి రాలేదు. అయితే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో ఆయుర్వేదం ఎంతగానో ఉప‌యోగ‌పడుతుందంటున్నారు నిపుణులు. తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండు ద్రాక్ష, శొంఠి వంటివి రోగ నిరోధక శక్తిని భారీగా పెంచుతాయ‌ని వారు చెప్తున్నారు. క‌రోనా పాజిటివ్ గా తేలిన‌ప్ప‌టికి.. దాని దుష్ప్రభావాలు మ‌న‌పై పెద్దగా […]

కరోనా క‌ట్ట‌డిలో...ఆయుర్వేదం కీల‌క‌పాత్ర‌
Follow us on

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. డెవ‌ల‌ప్పుడ్ కంట్రీస్ కూడా ఈ మ‌హమ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నాయి. ఇంత‌వ‌ర‌కు ఈ డేంజ‌ర‌స్ వైర‌స్ కు మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ అందుబాటులోకి రాలేదు. అయితే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో ఆయుర్వేదం ఎంతగానో ఉప‌యోగ‌పడుతుందంటున్నారు నిపుణులు. తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండు ద్రాక్ష, శొంఠి వంటివి రోగ నిరోధక శక్తిని భారీగా పెంచుతాయ‌ని వారు చెప్తున్నారు. క‌రోనా పాజిటివ్ గా తేలిన‌ప్ప‌టికి.. దాని దుష్ప్రభావాలు మ‌న‌పై పెద్దగా ఉండకుండా అవి కాపాడ‌తాయ‌ని పేర్కొంటున్నారు. వాటిని తీసుకోవ‌డం ద్వారా వ్యాధి భారిన ప‌డ్డ వ్య‌క్తులు త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌ని భ‌రోసా ఇస్తున్నారు.

ఆయుర్వేదంతో అనేక‌ ప్రయోజనాలను ఉన్నాయ‌ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవ‌ల చెప్పిన విష‌యం తెలిసిందే. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సూచించిన ప్రొటోకాల్‌ను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవ‌చ్చ‌ని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగాసనాలు వేయ‌డం-ధ్యానం చేయడం…. గోరువెచ్చటి నీరు తాగడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఆయుష్‌ శాఖ అందులో వెల్ల‌డించింది. వంటల్లో ఎక్కువ‌గా పసుపు, జీలకర్ర వంటివి వాడాలని.. బెల్లం, తాజా నిమ్మరసం క‌రోనాపై పోరుకు స‌హాయ‌ప‌డాతాయ‌ని సూచించింది.