COVID Vaccine : కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టొచ్చా? సీసీఎంబీతో జతకట్టిన కేరళలోని ఆర్య వైద్యశాల

|

Jan 02, 2021 | 10:02 AM

COVID Vaccine : ఆయుర్వేదంలో కొవిడ్‌కు వ్యాక్సిన్ కనుగొనడానికి కేరళ కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల(ఏవీఎస్‌) హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌

COVID Vaccine : కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టొచ్చా? సీసీఎంబీతో జతకట్టిన కేరళలోని ఆర్య వైద్యశాల
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

ఆయుర్వేదంలో కొవిడ్‌కు వ్యాక్సిన్ కనుగొనడానికి కేరళ కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల(ఏవీఎస్‌) హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)తో జత కట్టింది. ఆయుర్వేదంలో కొన్ని ఫార్ములాలు కొవిడ్‌ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఏవీఎస్‌ ప్రాథమికంగా గుర్తించింది. వాటిని సీసీఎంబీ ప్రయోగశాలలో పెంచిన కరోనా వైరస్‌పై ప్రయోగించి యాంటీ వైరల్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇది విజయవంతమైతే భారత ఔషధ పరిశ్రమలోనే సరికొత్త అధ్యయనానికి నాంది పలికినట్లవుతుంది.

పుట్టగొడుగులో యాంటీవైరల్‌ గుణాలు ఉన్నట్లు గతంలో సీసీఎంబీ నిర్ధారించింది. ఆధునిక సైన్స్‌తో ఆయుర్వేద శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ధ్రువీకరించే ప్రయత్నంలో సీసీఎంబీతో చేతులు కలిపామని ఏవీఎస్‌ సీనియర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్య వైద్యశాల 118 సంవత్సరాల పురాతన స్వచ్ఛంద సంస్థ. ఆయుర్వేద చికిత్సతోపాటు ప్రచారంలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ సంస్థ 500కుపైగా ఆయుర్వేద ప్రామాణిక సూత్రీకరణలను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. అయితే పురాతన గ్రంథాలపై ఆధారపడిన ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇప్పటివరకు ప్రొటోకాల్స్‌ లేవు. కరోనా వైరస్‌పై పనిచేసే ఔషధాలను ప్రజలకు ఇచ్చే ముందు పలు చికిత్సా అవకాశాలను కఠినంగా పరీక్షించడం అత్యవసరం. అప్పుడే వీటికి శాస్త్రీయత ఉంటుంది. తమ ప్రయోగశాలలో వృద్ధి చేసిన కరోనా వైరస్‌పై ఔషధాలు పనిచేస్తాయో లేదో పరీక్షించే సామర్థ్యం ఉందని ఆయుర్వేద ఫార్ములాల్లోని యాంటీవైరల్‌ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర అన్నారు.