అయోధ్య భూ వివాదం: ఐదోరోజుకి చేరిన సుప్రీం విచారణ

| Edited By: Pardhasaradhi Peri

Aug 13, 2019 | 9:02 AM

అయోధ్య భూ వివాదం పై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగతున్నాయి. ఆగష్టు 6 నుంచి మొదలైనప్పటికి రోజువారి వాదనలు జరుగుతున్నాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ వివాదంలో విచారణ నేడు ఐదో రోజుకి చేరుకుంది. హిందూ సంస్థ రామ్‌లల్లా తరపున సీనియర్ న్యాయవాది పరాశరన్ వాదనలు వినిపించనున్నారు. అయితే అయోధ్య రాముని జన్మస్థలమేనని ఇదివరకే పరాశరన్ కోర్టుకు తెలిపారు. మరోవైపు అయోధ్య భూవివాదం పై రోజువారి విచారణ జరపాలన్న సుప్రీం నిర్ణయాన్ని ముస్లిం వర్గాల తరపు […]

అయోధ్య భూ వివాదం: ఐదోరోజుకి చేరిన సుప్రీం విచారణ
Follow us on

అయోధ్య భూ వివాదం పై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగతున్నాయి. ఆగష్టు 6 నుంచి మొదలైనప్పటికి రోజువారి వాదనలు జరుగుతున్నాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ వివాదంలో విచారణ నేడు ఐదో రోజుకి చేరుకుంది. హిందూ సంస్థ రామ్‌లల్లా తరపున సీనియర్ న్యాయవాది పరాశరన్ వాదనలు వినిపించనున్నారు. అయితే అయోధ్య రాముని జన్మస్థలమేనని ఇదివరకే పరాశరన్ కోర్టుకు తెలిపారు. మరోవైపు అయోధ్య భూవివాదం పై రోజువారి విచారణ జరపాలన్న సుప్రీం నిర్ణయాన్ని ముస్లిం వర్గాల తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ వ్యతిరేకించారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చన న్యాయస్థానం.. రోజువారి విచారణలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చిచెప్పింది.