avika gor attends raj tarun house: షార్ట్ మూవీల ద్వారా కెరీర్ మొదలు పెట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ తర్వాత హీరోగా మారాడు. తొలిసినిమాతోనే నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ యంగ్ హీరో అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజ్ తరుణ్ కొత్తింట్లోకి అడుగుపెట్టారు. కరోనా నిబంధనల మేరకు కొంతమంది అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. రాజ్ తరుణ్ గృహ ప్రవేశం కార్యక్రమానికి నటి అవికా గోర్ హాజరైంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ఫ్యామిలీతో అవికా దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అవికతో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రాజ్ తరుణ్.. ‘నా మొదటి చిత్రం నుంచి నా కొత్తింటి గృహ ప్రవేశం వరకు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు అవిక’ అని కామెంట్ చేశాడు. ఇక ఈ ఫోటోకు అవికా రిప్లై ఇస్తూ.. ‘హ్యాపీ టియర్స్’.. అమి తుమాకో భాలో బాషి (నేను నిన్ను ప్రేమిస్తున్నా)’ అంటూ రాసుకొచ్చింది. రాజ్ తరుణ్, అవికా గోర్ కలిసి ‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్తా మామ’ చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే.