కరోనా పై పోరులో.. యోగి సర్కారుపై.. మోదీ ప్రశంసలు..

| Edited By:

Jun 26, 2020 | 2:48 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన

కరోనా పై పోరులో.. యోగి సర్కారుపై.. మోదీ ప్రశంసలు..
Follow us on

Atma Nirbhar UP Rojgar Abhiyan: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘‘ఆత్మనిర్భర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’’ ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సంభాషించారు. ఇక ఈ పథకం ద్వారా స్థానికంగా దాదాపు 1. 25 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని యూపీ అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. కరోనా పై పోరులో యూపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఒకప్పుడు ప్రపంచ దేశాలను జయించి, అతిపెద్ద శక్తులుగా అవతరించిన ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ తదితర యూరప్‌ దేశాల జనాభా మొత్తం కలిపి 24 కోట్లు. ఇది ఉత్తర ప్రదేశ్‌కు జనాభాకు సమానం. కోవిడ్‌-19 కారణంగా ఈ దేశాల్లో దాదాపు లక్షా ముప్పై వేల మంది మృత్యువాత పడగా.. యూపీలో కేవలం 600 కరోనా మరణాలు మాత్రమే సంభవించాయి. యూపీ సర్కారు మహమ్మారిపై పోరాడుతున్న తీరుకు ఇది నిదర్శనం’’ అని ప్రశంసించారు.

[svt-event date=”26/06/2020,2:46PM” class=”svt-cd-green” ]