ఏటీఎంలకు వచ్చే అమాయకులే టార్గెట్, ఏకంగా 118 కేసులు

|

Sep 26, 2020 | 10:04 PM

ఈ దొంగ రూటే సెపరేట్. ఏటీఎం సెంటర్ల వద్దకు అమాయకులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తాడు. వారిని బురిడీ కొట్టించి ఖాతాల్లోని డబ్బును కాజేస్తాడు.

ఏటీఎంలకు వచ్చే అమాయకులే టార్గెట్, ఏకంగా 118 కేసులు
Follow us on

ఈ దొంగ రూటే సెపరేట్. ఏటీఎం సెంటర్ల వద్దకు అమాయకులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తాడు. వారిని బురిడీ కొట్టించి ఖాతాల్లోని డబ్బును కాజేస్తాడు. ఈ కేటుగాడ్ని తాజాగా సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 18 ఏటీఎం కార్డులు, రూ.80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకుమార్‌గా గుర్తించారు. అయితే ఈ కేటుగాడిపై ఇప్పటికే 118 కేసులు ఉన్నాయట.  గతంలో 11 సార్లు జైలు అతనికి జైలు శిక్ష పడిందని పోలీసులు వివరించారు.

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం తెలియని వ్యక్తులతో రాజకుమార్ మొదట‌ మంచిగా మాట్లాడి నమ్మకం కలిగిస్తాడు. అనంతరం సొమ్ము‌ డ్రా చేసి ఇస్తానని చెప్పి ఏటీఎం కార్డులు కొట్టేస్డాని పోలీసులు తెలిపారు. బాధితులకు అనుమానం రాకుండా ఫేక్ కార్డులు ఇచ్చి.. అనంతరం వారి ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తాడని వెల్లడించారు.

Also Read :

ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు

కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం, ఈ పోలీసన్నకు సెల్యూట్