బ్రేకింగ్ న్యూస్: సమ్మెను విరమిస్తాం.. కానీ..!

| Edited By: Pardhasaradhi Peri

Nov 20, 2019 | 5:54 PM

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమస్యకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారే అన్న చందంగా ఉన్నారు. ఎవరూ మెట్టు దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్య హైకోర్టుకు వెళ్లినా.. ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. సమస్య ఎక్కడివేసిన గొంగళి అక్కడే వేసిన చందంలా.. ఉంది. తాజాగా.. డిమాండ్ల పరిష్కారం కోసం గత 47 రోజులుగా.. సమ్మె చేస్తోన్న ఆర్టీసీ జేఏసీ ఓ […]

బ్రేకింగ్ న్యూస్: సమ్మెను విరమిస్తాం.. కానీ..!
Follow us on

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమస్యకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారే అన్న చందంగా ఉన్నారు. ఎవరూ మెట్టు దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్య హైకోర్టుకు వెళ్లినా.. ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. సమస్య ఎక్కడివేసిన గొంగళి అక్కడే వేసిన చందంలా.. ఉంది.

తాజాగా.. డిమాండ్ల పరిష్కారం కోసం గత 47 రోజులుగా.. సమ్మె చేస్తోన్న ఆర్టీసీ జేఏసీ ఓ మెట్టు దిగింది. కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి షరతులు.. విధించకుండా.. విధుల్లోకి తీసుకుంటే.. సమ్మెను విరమించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.. అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు.

సమ్మెకు ముందు గతంలో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారో.. ఇప్పుడూ అవే కల్పించి.. విధుల్లోకి తీసుకుంటే.. ఎలాంటి షరతులకు లేకుండా ఉద్యోగాల్లోకి చేరుతామన్నారు అశ్వత్థామ రెడ్డి. హైకోర్టు తీర్పును గౌరవించి.. కార్మికుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. ప్రభుత్వం.. ఆర్టీసీ, యాజమాన్య స్పందన తరువాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.

మరోవైపు.. దీనిపై ప్రభుత్వం.. గురువారం నిర్ణయం తీసుకోనుంది. షరతులు లేకుండా కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం లేదని.. సర్కార్ స్పష్టం చేయడంతో.. మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.