RIP Arun Jaitley: జీఎస్టీ బిల్లులో కీరోల్‌ పోషించిన జైట్లీ..!

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2019 | 3:51 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు ఆర్థిక శాఖ నిర్వహించిన జైట్లీకి తర్వాత రక్షణ శాఖ కూడా అప్పగించారు. […]

RIP Arun Jaitley: జీఎస్టీ బిల్లులో కీరోల్‌ పోషించిన జైట్లీ..!
Follow us on

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

కాగా.. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు ఆర్థిక శాఖ నిర్వహించిన జైట్లీకి తర్వాత రక్షణ శాఖ కూడా అప్పగించారు. జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నపుడే 2016 నవంబర్‌ 9న నోట్ల రద్దు జరిగింది. జీఎస్‌టీ పేరుతో జీఎస్టీ కూడా జైట్లీ హయాంలోనే దేశంలో ప్రారంభమైంది. దీనికి ముందే వ్యక్తుల ఆదాయ స్వయం ప్రకటిత పథకాన్ని ప్రకటించారు జైట్లీ. బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్న ఆస్తులను వెలికితీసే కార్యక్రమాన్ని కూడా ఆరంభించారాయన. జనధన్‌ పేరుతో పేదలకు బ్యాంకు అకౌంట్లకు శ్రీకారం చుట్టింది కూడా అరుణ్‌జైట్లీ.. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న అరుణ్‌జైట్లీ కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. కశ్మీర్‌ మాజీ మంత్రి గిరిధారి లాల్‌ డోగ్రా కుమార్తె సంగీతను 1982లో వివాహం చేసుకున్నారు. జైట్లీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.