ముగిసిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

| Edited By:

Aug 25, 2019 | 8:32 PM

బీజేపీ సీనియర్ నేత దివంగత అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. అభిమానుల, కార్యకర్తల సందర్శనార్థం జైట్లీ పార్థివదేహాన్ని ఈ మధ్యాహ్నం వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు. జైట్లీ పార్థివదేహాన్ని […]

ముగిసిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు
Follow us on

బీజేపీ సీనియర్ నేత దివంగత అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. అభిమానుల, కార్యకర్తల సందర్శనార్థం జైట్లీ పార్థివదేహాన్ని ఈ మధ్యాహ్నం వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు. జైట్లీ పార్థివదేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో.. యమునా నది ఒడ్డున గల నిగమ్‌బోధ్ శ్మశాసవాటికకు తరలించారు. దారి పొడవునా జట్లీ జీ అమర్ రహే… లాంగ్ లీవ్ జైట్లీ జీ అంటూ అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు చివరిసారిగా జైట్లీకి కన్నీటి వీడ్కోలు పలికారు.