ఆయనా ఆ కోవలోని వారే! : చరిత్రకారుడు రామచంద్ర గుహ ఫైర్

| Edited By: Ram Naramaneni

Aug 05, 2019 | 4:25 PM

ఆర్టికల్ 370 రద్దు పై చరిత్ర పరిశోధకులు రామచంద్ర గుహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీరుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు కోవింద్ ఏ మాత్రం తీసిపోరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఫక్రుద్ధీన్ రాష్ట్రపతిగా ఉన్నారు. అప్పట్లో ఇందిర సంచలన నిర్ణయం ఎమర్జెన్సీకి ఫక్రుద్ధీన్ ఆమోద ముద్ర వేశారు. 1975 జూన్ 25న ప్రధాని ఇందిరాతో […]

ఆయనా ఆ కోవలోని వారే! : చరిత్రకారుడు రామచంద్ర గుహ ఫైర్
Follow us on

ఆర్టికల్ 370 రద్దు పై చరిత్ర పరిశోధకులు రామచంద్ర గుహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీరుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు కోవింద్ ఏ మాత్రం తీసిపోరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఫక్రుద్ధీన్ రాష్ట్రపతిగా ఉన్నారు. అప్పట్లో ఇందిర సంచలన నిర్ణయం ఎమర్జెన్సీకి ఫక్రుద్ధీన్ ఆమోద ముద్ర వేశారు. 1975 జూన్ 25న ప్రధాని ఇందిరాతో సమావేశమైన అనంతరం దేశంలో అత్యవసర పాలన విధిస్తున్నట్లు ఫక్రుద్ధీన్ ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఫక్రుద్దీన్ పై విమర్శలు వచ్చాయి. అయితే రానురాను ఆ వ్యవహారంలో అప్పటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీపై విమర్శలు వెల్లువెత్తాయి. కాని, ఫక్రుద్దీన్ ప్రస్తావన క్రమంగా మరుగున పడిపోయింది. కాగా, ఇన్ని రోజుల తర్వాత ఫక్రుద్ధీన్‌ను రామచంద్ర గుహ గుర్తు చేసుకున్నారు. ఫక్రుద్ధీన్‌లాగే కోవింద్ వ్యవహరించారని ఆయన ఫైర్ అయ్యారు.