కేంద్రంపై రెహమాన్ పరోక్ష విమర్శలు

| Edited By:

Jun 05, 2019 | 1:07 PM

లెజండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రభుత్వం ఏదైనా.. పాలన ఎవరిదైనా.. ఆయన రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే తాజాగా కేంద్రంపై చురకలు అంటించారు ఈ సంగీత దిగ్గజం. అటానమస్ అన్న పదాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన రెహమాన్.. దానికి కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ డిక్షనరీలో అర్థం అంటూ ఓ లింక్‌ను పెట్టారు. అందులో అటానమస్ అర్థం ‘‘స్వతంత్రంగా, సొంతంగా మన నిర్ణయాలను మనం తీసుకోగలడం’’ అని […]

కేంద్రంపై రెహమాన్ పరోక్ష విమర్శలు
Follow us on

లెజండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రభుత్వం ఏదైనా.. పాలన ఎవరిదైనా.. ఆయన రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే తాజాగా కేంద్రంపై చురకలు అంటించారు ఈ సంగీత దిగ్గజం. అటానమస్ అన్న పదాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన రెహమాన్.. దానికి కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ డిక్షనరీలో అర్థం అంటూ ఓ లింక్‌ను పెట్టారు. అందులో అటానమస్ అర్థం ‘‘స్వతంత్రంగా, సొంతంగా మన నిర్ణయాలను మనం తీసుకోగలడం’’ అని ఉంది.

అయితే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాఠశాల్లలో ఎనిమిద తరగతి వరకు హిందీని కచ్చితం చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకొంది. అయితే దీనిపై పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకునేది లేదంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఘాటుగా తమ స్వరాలను వినిపించిన విషయం తెలిసిందే.