ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే హైదరాబాద్‌కు సర్వీసులు!

|

Oct 10, 2020 | 2:08 PM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ దారిలోకే ఏపీఎస్ఆర్టీసీ వస్తున్నట్లు సమాచారం.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే హైదరాబాద్‌కు సర్వీసులు!
Follow us on

APSRTC New Proposal: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ దారిలోకే ఏపీఎస్ఆర్టీసీ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఏపీఎస్ఆర్టీసీ.. టీఎస్ఆర్టీసీ కిలో మీటర్ల పరిధిని పెంచేందుకు ప్రయత్నించింది. కానీ తెలంగాణ మొదటి నుంచి ఒకే ప్రతిపాదనకు కట్టుబడి ఉండటంతో.. చర్చలు సఫలం కాలేదు. దీనితో టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించిన 1.61 లక్షల కిలోమీటర్ల మేరకు బస్సు సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమవుతోంది. ఆర్టీసీకి దసరా టైం కీలకం కావడంతో మరో రెండు, మూడు రోజుల్లో అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టీఎస్ఆర్టీసీ మాదిరిగా హైదరాబాద్-విజయవాడ రూట్‌పై ఎక్కువ ఫోకస్ చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గతంలో ఈ రూట్‌లో టీఎస్ఆర్టీసీ 50-60 బస్సులు నడపగా.. ఏపీ‌ఎ‌స్‌‌ఆ‌ర్టీసీ రోజుకు 150–160 బస్సులు నడిపింది. అయితే తాజాగా ఒప్పందంలో టీఎస్ఆర్టీసీ హైద‌రా‌బాద్‌– విజ‌య‌వాడ మార్గం‌లో ఎక్కువ బస్సులు నడిపేందుకు ప్రాధాన్యమిచ్చింది.

స్టేజీ క్యారియర్లగా బస్సు సర్వీసులు.. టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించిన 1.61 లక్షల కిలో‌మీ‌టర్ల మేర బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు మిగిలిన లక్ష కిలోమీటర్ల మేరకు అదనంగా 350 సర్వీసులను త్రైమాసిక పన్ను చెల్లించి స్టేజీ క్యారియర్లుగా తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Also Read: 

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..