జాదవ్‌ తీర్పుపై పాక్ స్పందన!

| Edited By:

Jul 19, 2019 | 4:44 AM

కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష నిలిపి వేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై పాక్‌ ప్రధాని స్పందించారు. ఈ మేరకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ట్వీట్ చేశారు. ‘కుల్‌భూషణ్‌ యాదవ్‌ మరణ దండన ఆపాలనే ఐసీజే తీర్పును గౌరవిస్తున్నాం. ఆయన పాకిస్థాన్‌ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్థాన్‌ చట్ట ప్రకారం నడుచుకుంటుంది’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. జాదవ్‌ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడినందుకుగానూ 2016లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ […]

జాదవ్‌ తీర్పుపై పాక్ స్పందన!
Follow us on

కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష నిలిపి వేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై పాక్‌ ప్రధాని స్పందించారు. ఈ మేరకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ట్వీట్ చేశారు. ‘కుల్‌భూషణ్‌ యాదవ్‌ మరణ దండన ఆపాలనే ఐసీజే తీర్పును గౌరవిస్తున్నాం. ఆయన పాకిస్థాన్‌ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్థాన్‌ చట్ట ప్రకారం నడుచుకుంటుంది’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

జాదవ్‌ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడినందుకుగానూ 2016లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ చెబుతోంది. విచారణ చేపట్టిన సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఆయన గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పేర్కొంది. అయితే, ఈ వాదనలను భారత్‌ ఖండిస్తూ, అదే ఏడాది మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భూషణ్‌ అసలు పాకిస్థాన్‌ వెళ్లనే లేదని, ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరణకు గురయ్యారని పేర్కొంది. దీంతో మరణ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన న్యాయస్థానం- గత ఫిబ్రవరిలో విచారణ చేపట్టింది.