అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి.. బిల్డింగ్ పైనుండి పడి దుర్మరణం

అపార్ట్‌మెంట్ బిల్డింగ్ పైనుండి పడి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.

అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి..  బిల్డింగ్ పైనుండి పడి దుర్మరణం

Updated on: Jan 10, 2021 | 9:56 PM

Watchman suspected death: హైదరాబాద్ మహానగరంలో ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బాలాజీ గత సంవత్సరం నుంచి అంబర్ పెట్ డీడీ కాలనీ సాయి కృప అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే బాలాజీ కుటుంబం అపార్ట్‌మెంట్ కింది రూమ్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇవాళ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ పైనుండి పడి బాలాజీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అంబర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, ఆత్మహత్య చేసుకున్నాడా అని పోలీసులు విచారణ చేపట్టారు. బాలాజీ మ‌ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us