వరలక్ష్మిని పీక కోసి చంపేంత పరిస్ధితి ఏమొచ్చింది: అనిత

|

Nov 01, 2020 | 2:24 PM

గా౦ధీ చెప్పినట్లు అర్థరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద తిరగటం కాదు….ఇ౦ట్లో ఉన్నా భద్రత కొరవడుతో౦దన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను అనిత, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్, స్థానిక టీడీపీ నేతలు పరామర్శి౦చారు. వరలక్ష్మిని పీక కోసి చంపేంత పరిస్ధితి ఏమొచ్చిందని అనిత ఈ సందర్భంలో ప్రశ్నించారు. ఆడకూతుర్ని చంపుకుంటున్నామంటే ఏరోజుల్లో వున్నామని ఆమె అన్నారు. రోజుకో ఘటన జరుగుతోందని…. మహిళలపై […]

వరలక్ష్మిని పీక కోసి చంపేంత పరిస్ధితి ఏమొచ్చింది: అనిత
Follow us on

గా౦ధీ చెప్పినట్లు అర్థరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద తిరగటం కాదు….ఇ౦ట్లో ఉన్నా భద్రత కొరవడుతో౦దన్నారు టీడీపీ ఏపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను అనిత, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్, స్థానిక టీడీపీ నేతలు పరామర్శి౦చారు. వరలక్ష్మిని పీక కోసి చంపేంత పరిస్ధితి ఏమొచ్చిందని అనిత ఈ సందర్భంలో ప్రశ్నించారు. ఆడకూతుర్ని చంపుకుంటున్నామంటే ఏరోజుల్లో వున్నామని ఆమె అన్నారు. రోజుకో ఘటన జరుగుతోందని…. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట పడటం లేదని అనిత ఆవేదన వ్యక్త౦ చేసారు. చనిపోయిన ఆడకూతుర్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పని పూర్తయినట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కఠిన విధానాలు తేకు౦డా అలా పరిహారం ప్రకటించుకుంటూ పోతే, ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకునే దుస్ధితి రావచ్చని అనిత అన్నారు. వరలక్ష్మి గొంతకోసి చంపిన ఘటనపై కన్నబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. ఆగ్రహం