Nivar Compensation : నివార్ పరిహారం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి.. నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

| Edited By: Pardhasaradhi Peri

Dec 28, 2020 | 8:01 AM

నివార్ తుపాను బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. దెబ్బతిన్న పంటలకు పెట్టుబడిగా రాయితీ చెల్లించేందుకుగానూ రూ.601 కోట్లు విడుదల చేసింది. నష్టపోయిన రైతుల...

Nivar Compensation : నివార్ పరిహారం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి.. నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్
Follow us on

Nivar Compensation : నివార్ తుపాను బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. దెబ్బతిన్న పంటలకు పెట్టుబడిగా రాయితీ చెల్లించేందుకుగానూ రూ.601 కోట్లు విడుదల చేసింది. నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నష్టపరిహారంను జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని విపత్తు నిర్వాహణ శాఖకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

వీరికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకలకు అనుగుణంగా పరిహారం చెల్లించాల్లిస్తున్నారు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు.

ఇక నివర్ తుపాను ఏపీలో భారీ బీభత్సం సృష్టించింది. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు 8 జిల్లాలు వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు తుపాను ధాటికి విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది.