ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ.. ఎప్పుడంటే.?

|

Jan 03, 2020 | 6:22 AM

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలన్న ఆయన.. అర్హుల తుది జాబితాను సంక్రాంతి నాటికి సిద్ధం చేసి గ్రామ సచివాలయాల్లో ఉంచాలని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమంలో మరింత శ్రద్ధ పెట్టాలన్న సీఎం.. భూముల గుర్తింపు, సేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. అటు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు […]

ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ.. ఎప్పుడంటే.?
Follow us on

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయాలన్న ఆయన.. అర్హుల తుది జాబితాను సంక్రాంతి నాటికి సిద్ధం చేసి గ్రామ సచివాలయాల్లో ఉంచాలని స్పష్టం చేశారు.

పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమంలో మరింత శ్రద్ధ పెట్టాలన్న సీఎం.. భూముల గుర్తింపు, సేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. అటు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం అందించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దిశ చట్టం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. అటు అమ్మఒడికి సంబంధించిన తుది జాబితాను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. కాగా, ఈ పథకం జనవరి 9న లాంఛనంగా ప్రారంభం కానుంది.