టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని.. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు

|

Jan 06, 2021 | 3:34 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని.. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు
Kodali Nani
Follow us on

Kodali Nani sensational Comments on Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు అసలు మనిషే కాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఇవాళ కృష్ణా జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ . వాడుకోవడం.. వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్న మంత్రి.. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మతాలు, కులాల గురించి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సీఎం, హోమ్ మంత్రి, డి జి పి, ఎస్ పిలకు మతాలు అంటగట్టడం సరికాదన్నారు.

అధికారులు మతాల వారీగా పని చేయరు, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తారని మంత్రి నాని గుర్తు చేసిన మంత్రి.. రాష్ట్రంలోని హిందూ, క్రిస్టియన్, ముస్లిం, అన్ని వర్గాలు ఆదరించబట్టే చంద్రబాబు ఈ స్థాయిలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో మతాల, మధ్య కులాల మధ్య చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. త్వరలోనే చంద్రబాబును భూస్థాపితం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ గురించి మిడత లాంటి లోకేష్ మాట్లాడటం విడ్డూరమన్న నాని.. వైయస్ జగన్ అంటే ఒక వ్యవస్థ అని ఉద్ఘాటించారు.

Read Also:
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగవుతుంది.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్…