సదరం క్యాంపుల నిర్వహణపై బొత్స ఆదేశాలు

|

Nov 02, 2020 | 2:37 PM

కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషంట్లకు ఆరోగ్యశ్రీ కింద కచ్చితంగా చికిత్స అందించాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా లోని కదిరి, తనకల్లు ఆస్పత్రుల్లో డాక్టర్లను నియమించాలని బొత్స వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే జిల్లా అధికారులు సత్వరమే స్పందించాలని ఆయన తెలిపారు. సదరం క్యాంపుల నిర్వహణకు మొబైల్ సదరమ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని బొత్స అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ […]

సదరం క్యాంపుల నిర్వహణపై బొత్స ఆదేశాలు
Follow us on

కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషంట్లకు ఆరోగ్యశ్రీ కింద కచ్చితంగా చికిత్స అందించాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా లోని కదిరి, తనకల్లు ఆస్పత్రుల్లో డాక్టర్లను నియమించాలని బొత్స వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే జిల్లా అధికారులు సత్వరమే స్పందించాలని ఆయన తెలిపారు. సదరం క్యాంపుల నిర్వహణకు మొబైల్ సదరమ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని బొత్స అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలుపై సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో మరోసారి సమావేశం నిర్వహించి, కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ సిరికి బొత్స ఆదేశమిచ్చారు. డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని ప్రైవేట్ ఆస్పత్రులకు తెలియచేయాలన్నారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మొదటి అజండా అంశంగా కోవిడ్ పై సమీక్ష నిర్వహించిన సందర్భంలో బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.