ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం… ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ప్రకటన…

| Edited By: Venkata Narayana

Dec 04, 2020 | 9:58 PM

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ లో తీర్మానాన్ని డిసెంబర్ 4న ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు అనుకూల పరిస్థితులు లేవని అన్నారు.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం... ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ప్రకటన...
Follow us on

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ లో తీర్మానాన్ని డిసెంబర్ 4న ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రవేశపెట్టారు. ఎన్నికల నిర్వహణ విషయమై జరిగిన చర్చ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ… రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు అనుకూల పరిస్థితులు లేవని అన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఈసీ తీరును తప్పుపట్టారు.

 

కాగా, మార్చి నుంచి ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై చర్చ సాగుతూ వస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వాయిదా విధానాన్ని అనుసరించింది. ఆ తర్వాత ఈసీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అని చెప్పగా వైసీపీ నేతలు బహిరంగంగా ఈసీ తీరును తప్పుపట్టారు. చివరకు ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవగా… కరోనా మహమ్మారి వచ్చింది. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపింది. అయితే ప్రతిపక్షాలు కరోనా కారణంగా ప్రజల ప్రాణాలు ఆపదలో పడతాయని విన్నవించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం, ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో ఏపీలోనూ  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఈసీ చెబుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం ససేమీరా అంటోంది. ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఈసీ తీరును తప్పుపడుతున్నారు.