ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలు ముగిసేవరకు జియో టీవీ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు..

|

Dec 09, 2020 | 8:51 AM

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని(2020-21) పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలు ముగిసేవరకు జియో టీవీ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు..
Follow us on

AP Inter Students: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని(2020-21) పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా విద్యకు దూరమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జియో టీవీ ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్ 8వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు పరీక్షలు ముగిసేవరకు వీడియో పాఠాలను ప్రసారం చేస్తామన్నారు. అలాగే బోర్డుకు చెందిన Bieap Virtual Class యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

కాగా, ప్రస్తుతం ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం క్లాసెస్ ప్రసారం అవుతుండగా.. త్వరలోనే ఇంటర్ ఫస్టియర్, జేఈఈ, ఎంసెట్, నీట్ పాఠాలను సైతం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అటు ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన టైమ్‌టేబుల్ కోసం విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సందర్శించాలని సూచించారు.