హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..

| Edited By:

May 05, 2020 | 1:31 PM

AP High court: హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నెంబర్ 623ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ 19వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. కార్యాలయాల రంగులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా కొత్తగా 623 జీవోను విడుదల చేశారంటూ న్యాయవాది సోమయాజి […]

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..
Follow us on

AP High court: హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నెంబర్ 623ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ 19వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. కార్యాలయాల రంగులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా కొత్తగా 623 జీవోను విడుదల చేశారంటూ న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేశారు. పాత జీవోలో ఉన్న అంశాలే ఈ జీవోలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ రంగులన్నీ అలాగే ఉండేలా కొత్త జీవో ఉందని తెలిపారు. దీంతో జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: మందుబాబులకు షాక్మద్యంపై కరోనా సెస్… 70 శాతం..