ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ అరెస్టుపై వాదోప‌వాద‌న‌లు..కోర్టు ఏం చెప్పిందంటే..

|

Jun 13, 2020 | 4:41 PM

ఈఎస్ఐ స్కామ్ లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న‌ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై అత‌డి భార్య ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. రమేష్ కుమార్ అరెస్టు అక్రమమని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉంద‌ని ఆమె పేర్కొంది.

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ అరెస్టుపై వాదోప‌వాద‌న‌లు..కోర్టు ఏం చెప్పిందంటే..
Follow us on

ఈఎస్ఐ స్కామ్ లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న‌ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై అత‌డి భార్య ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. రమేష్ కుమార్ అరెస్టు అక్రమమని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉంద‌ని ఆమె పేర్కొంది. మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టులో న్యాయవాది పీవీ కృష్ణయ్య హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కోర్టు పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించ‌గా.. వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి.

నోటీస్ ఇవ్వకుండానే రమేష్ కుమార్ అరెస్ట్ చేశారని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలు చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నార‌ని పిటిష‌న‌ర్ త‌రపు న్యాయవాది పీవీ కృష్ణయ్య కోర్టుకు తెలిపారు. అయితే నిందితుడు భార్య‌కు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. నిందితుడుకైనా నోటిసు ఇవ్వాలని, అది కూడా జరగలేదని, నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టి విడుదల చేయటానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. మ‌రోవైపు జ్యుడీషియల్ కస్టడీకి రమేష్ కుమార్ ను అప్పగించమని ప్రభుత్వ న్యాయవాది త‌న వాద‌న‌ను న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు…తదుపరి విచారణ సోమవారంకి వాయిదా వేసింది.